ANDHRA PRADESH VISWABRAHMIN EMPLOYEES GROUP

Estd: 2020

About APVBE GROUP

AP విశ్వబ్రాహ్మిన్ ఎంప్లాయిస్ గ్రూప్ (APVBE )

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నే కాకుండా మన దేశం లో ఉన్న తెలుగు విశ్వబ్రాహ్మిన్ ఉద్యోగులందరినినీ ఒక త్రాటిపైకి తెచ్చి సంఘటితం చేయడం ప్రధాన లక్ష్యం.
అందుకు ఒక నెట్వర్క్ తయారు చేసి ఆ గ్రూప్ ద్వారా ఒకరికొకరిని పరిచయం చేయడం . ఎవరెవరు, ఎక్కడ , ఎక్కడ ఉన్నారో అందరికి తెలియ జేయడం . తద్వారా మన సభ్యుల మధ్య పరిచయాలు , స్నేహేశీలత , బంధుత్వాలను పెంపొందించడానికి కావాల్సిన పునాదులు వేయడం ముఖ్య ఉద్దేశ్యం. ముందుగా మన ఆంధ్ర ప్రదేశ్ మీద ద్రుష్టి కేంద్రీకరించడం జరిగింది
అంతే కాకుండా మన విశ్వబ్రాహ్మిన్ జాతి లో ఉన్న వివిధ చేతి వృత్తుల వారిని , మిగిలిన వివిధ వర్గాలవారిని , ముందుగా వారి వర్గాల వారీగా సంఘటితం చేసి వారినందరిని మనతో పాటు ఒకే త్రాటిపైకి తెచ్చే దీర్ఘ కాలిక ప్రణాళిక తో ముందుకు వెళ్లడం ఇంకొక ముఖ్య ఉద్దేశ్యం.
ఇది చాల కష్టతరమైన ప్రయత్నం అని తెలిసి కూడా నిజాయితీతో , నిబద్దతో, చిత్త శుద్దితో ప్రాక్టికల్ ప్రణాళికతో ప్రయత్నిస్తూ ముందుకు వెళితే సాధించగలమనే నమ్మకం తో పురోగమిస్తున్నాం .
ఈ బృహత్తరమైన ఉద్దేశ్యం తో 26-6-2020 నాడు పదిమందితో మొదలు పెట్టిన ప్రయాణం నేటికీ 430 పైచిలుకు సభ్యులతో ముందుకు వెళ్తుంది.
ఈ గ్రూప్ లో ఉన్న ఉన్నత ఉద్యోగాలలో గాని , ఉద్యోగాలలో కీలకమైన స్థానాలలో ఉన్న మన సభ్యుల సలహా లు , సహాయ సహకారాలతో , మరియు రిటైర్ అయిన అనుభవజ్ఞుల మార్గదర్శనం లో మన సభ్యులకు, తద్వారా మన జాతికి మేలు చేసే కార్యక్రమాల రూపకల్పన చేయడం , వాటిని ఆచరించడం .
ఈ ఆశయాలు ప్రాక్టికల్ రూపం లోనికి తీసుకు రావడకి వీలుగా ఒక 25 మంది అనుభవజ్ఞులైన సభ్యులతో ఒక కార్య నిర్వాహక కమిటీ ఏర్పాటు చేయడం , దాని ద్వారా నిర్ణయాలు తీసుకోవడం , ఆచరించడం జరుగుతుంది .
ఆచరణలో ఇవనీ కార్య రూపం సాధించాలంటే Get -together లు పిక్నిక్ లు అవసరమని భావించి ఇంతవరకు రెండు Get -together లు, రెండు పిక్నిక్ లు (వన సమారాధన లు ) విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
మన జాతి బాగుపడాలన్నా , అభివృద్ధి చెందాలన్నా అది మన పిల్లలతోనే మొదలు పెట్టాలని , అది వారి ద్వారానే భవిష్య్తతులో సాధ్యమని నమ్మి , వారందరికీ విద్య , ఉద్యోగాలలో నైపుణ్య శిక్షణ పొందడం లో ను గైడ్ చేయడం , వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ,సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలు చేపట్టడం , తద్వారా వారి కుటుంబాలను ఆర్ధికంగానూ సామాజికంగానూ అభివృద్ధి పథం లోకి తీసుకు రావడం ద్వారానే మన జాతి అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రగాఢంగా నమ్ముతూ , దానికి సంభందించిన కార్యక్రమాల మీద తీవ్రమైన ద్రుష్టి పెట్టి ముందుకు తీసుకుని వెళ్లడం ఇంకొక ముఖ్య మైన ఉద్దేశ్యం.
ఇది నెరవేరడానికి VB -SKILL TRAININGS AND EMPLOYMENT అనే గ్రూప్ ను నిర్వహించడం ద్వారా ముందుకు వెళ్తున్నాం.
వివాహ పరిచయ వేదిక :
మన కుటుంబాలకు ఎంతో అవసరమైన మరో ముఖ్య కార్యక్రమం వారి పిల్లల వివాహాలు .వారి వారి పిల్లలకు సరిఅయిన మంచి సంభందం కుదుర్చుకోవడం చాల పెద్ద సమస్య మరియు ఎంతో అవసరమైన ఒక ముఖ్య కార్యక్రకమం .ఈ కార్యక్రమ ఆవశ్యకతను , అవసర తీవ్రతను గుర్తించి APVBE- వివాహ పరిచయ వేదిక- Group ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిచాలా secured గాను మరియు విజయవంతంగా నడుస్తున్న కార్యక్రమం.
పైన చెప్పిన మూడు గ్రూపులు మాత్రమే కాకుండా మన జాతి సభ్యులలో ని గూఢమై ఉన్న కళలను, ప్రజ్ఞా పాటవాలను వెలికి తీసి, గుర్తించి, ప్రోత్సహించే ఉద్ద్యేశ్యం తో ఈ క్రింది నాలుగు గ్రూప్ లను ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుచున్నది
1) VB -Poets & Writers - Group
2) VB -Fine Arts -Group
3) VB - Musicians & Singers -Group
4) VB -Stage Performers -Group
ఇంకా ఇతర ఆశయాలు ఏమంటే :
1) మన విశ్వబ్రాహ్మిన్ జాతిలో ఉన్న సేవా తత్పరులను,జాతి గర్వించదగిన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖులను ,వివిధరంగాలలో ఉన్న మన జాతి మాణిక్యాలను గుర్తించి వివిధ కార్యక్రమాలలో వారిని సన్మానించి గౌరవించడం-తద్వారా మన జాతి ఔన్నత్యాన్ని పెంచడం .
2 ) మన జాతి వృత్తులలో ఉన్న మన మిత్రులను ఆర్ధికంగా బలోపేతం చేసే మార్గాలను అన్వేషించి వారికి మార్గదర్శనం చేయడం.
3 ) మన జాతి లో ఉన్న నిరుపేద సభ్యులకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాలను రూపొందించడం ,వారికి మనోస్థైర్యాన్ని కల్పించే కార్యక్రమాలు రూప కల్పన చేయడం
4 ) మన సోదర సంస్థలు అన్నింటితో చేయి చేయి కలిపి నడుస్తూ మన జాతి ఔన్నత్యానికి కృషి చేయడం

ఇట్లు మీ
KNS PRAKASH RAO
Visakhapatnam
9705386665


OUR VISION

To unite all our Telugu Viswabrahmin Employees of various groups that bridges the gap between various groups and make a network to lay necessary foundations to develop contacts, friendships and kinship among our members.


OUR MISSION

Our Mission is to provide information on skill development training for our community individuals that fosters their personal and professional growth and empowers them with relevant skills and practical experience required to excel in getting jobs.