మన విశ్వబ్రాహ్మణ ఉద్యోగ మిత్రులందరికీ ఒక మంచి శుభవార్త
చాలామంది మా గ్రూప్ సభ్యుల కోరిక మేరకు మరియు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల (APVBE) గ్రూప్ తరపున ఒక వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి ఉన్నాం. . ఇది మన వారికి సంభందించిన ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి , పెండ్లి కావలసిన అబ్బాయిల , అమ్మాయిల తల్లి తండ్రులు కానీ సోదరులు ,గాని ఈ గ్రూప్ లో జాయిన్ అవగలరు .
ఈ గ్రూప్ లో జాయిన్ అయే విధానం:-
Step-1: ఈ క్రింద ఇచ్చిన గూగుల్ ఫారం CLICK చేసి , మీ అబ్బాయి లేక అమ్మాయి వివరాలు అన్నియు అందులో నింపి సబ్మిట్ చేయండి.
గూగుల్ ఫారం లింక్ : https://forms.gle/mmYbah1qwZatj6fJ7
Step-2: ఈ క్రింద నిచ్చిన ఫార్మటు (Microsoft WORD format )నింపి , రెండు ఫోటోలు (బస్ట్- ఫోటో ఒకటి -CLOSE UP PHOTO , నిలుచున్న(స్టాండింగ్)ఫోటో ఒకటి పేస్ట్ చేసి , ఆ ఫిల్ చేసిన ఫార్మటు ను వాట్సాప్ (9705386665) కు గాని ,E Mail: apvbe.group@gmail.com కు గాని పంపండి. దయచేసి ప్రొఫైల్ పంపే ఫార్మాట్ WORD FORMAT లోనే ఉంచండి. ఎట్టి పరిస్థితులలోను వేరే ఫార్మట్స్ Like PDF లోనికి మార్చవద్దు. మార్చితే మాకు ఇబ్బంది అవుతుంది -గమనించ గలరు.
ముఖ్య గమనిక:పైన ఇచిన GOOGLE FORM నింపటం లో గాని , WORD FORMAT నింపి రెండు ఫోటోలు పేస్ట్ చేయడం లో కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నట్లైతే కంప్యూటర్ బాగా వచ్చిన మీ పిల్లల సహాయం తీసుకోండి. లేకపోతే దయ చేసి మీ దగ్గర్లో ఉన్న నెట్ సెంటర్ సహాయం తీసుకోండి
ఇట్లు
Group Admin
APVBE- గ్రూప్ -EXECUTIVE కమిటీ తరపున
తెలుగు విశ్వబ్రాహ్మణ వధూవరుల వివాహ సంబంధాలు విషయమై, పై స్వచ్ఛంద సంస్థ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది ఉద్యోగుల ఉద్యోగం చేస్తున్న పిల్లలకు మాత్రమే కాకుండా మన వృత్తి పని వారి చదువుకుని ఉద్యోగం చేస్తున్న పిల్లల గురించి కూడా ఏర్పాటు చేయడమైనది. కావున అవసరమైన వాళ్లంతా ఈ సేవను ఉపయోగించుకోగలరు . ఇది మన విశ్వబ్రాహ్మణ జాతి మంచి గురించి Elite group of Employees ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమం.
ముందుగా ఈ క్రింద నిచ్చిన గూగుల్ లింక్ ను ప్రెస్ చేసి గూగుల్ ఫామ్ నింపడం ద్వారా మీ డీటెయిల్స్ అన్ని పంపండి.
ఆ తర్వాత ఏం చేయాలి (next step) అనేటువంటిది మీకు తెలియజేస్తాం.
GOOGLE FORM LINK :
https://forms.gle/mmYbah1qwZatj6fJ7
ఇట్లు గ్రూప్ అడ్మిన్స్
AP Viswabrhmin Employees Group
మన ఈ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఎంప్లాయిస్ గ్రూప్ సభ్యులందరికి శుభోదయం. అందరికి శుభదినం. మన ఈ AP విశ్వబ్రాహ్మణ ఎంప్లాయిస్ గ్రూప్ ఆవిర్భవించి ఈనాటికి (26 -6 -2024 ) సరిగ్గా నాలుగు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరం లోకి అడుగిడుతున్నది. మంచి కరోనా కాలం లో ఒక పదిమందితో మొదలైన మన గ్రూప్ ఈ నాలుగు సంవత్సరాలలో దాదాపుగా 450 కి చేరుకుంది . అందులకు ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ శుభాకాంక్షలు.... మరియు శుభాభినందనలు. ఒక చిన్న మొక్కను ఈ నాలుగేళ్లలో ఒక వృక్షంగా ఎదగడా నికి సహకరించిన మీ అందరికీ, మరియూ ఈ మన గ్రూప్ కార్యవర్గ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం.
ఆవిర్భావం నుండి అఖుంటిత దీక్షతో, రెండు ఆత్మీయ సమావేశాలు, మరో రెండు పిక్నిక్ లు విజయవంతంగా నిర్వహించి మీ అందరి అభిమానాన్ని పొందడం మా అందరికి చాలా సంతోషం. అలానే మన వారి అవసరాలను గుర్తించి విశాఖపట్నంలో ఇంకొక నాలుగు రోజుల్లో అనగా ౩౦-6-2024 (ఆదివారం) నాడు "ప్రత్యక్ష వివాహ పరిచయ వేదిక" ను నిర్వహిస్తున్న మా ప్రయత్నానికి వస్తున్న అపూర్వ స్పందనకు మీ అందరికీ కృతజ్ఞతలు .
ముందుగా మన రాష్ట్రములో ఉన్న మనవాళ్ళందరినీ (ముఖ్యంగా మన ఉద్యోగులందరినీ) ఒక నెట్వర్క్ ద్వారా ఏకం చేసి తద్వారా మన మిగతా వర్గాలను కూడా ఒకే గొడుగు క్రిందకు తెచ్చి, ఒక విస్తృతమైన వేదికను మన విశ్వ బ్రాహ్మణజాతికి ఏర్పాటుచేసి, వారి అభివుద్ధికి , సంక్షేమానికి, ఈ టెక్నాలజీ యుగంలో విభిన్నంగా పురోగమిస్తూ మన యువశక్తిని బలోపేతం చేయడం ద్వారా కొన్ని లోపాలను అధిగమించి, అందరినీ కలుపుకొని మన జాతిని ముందుకు తీసుకు వెళ్లడమే మా ఏకైక లక్ష్యం. ఇది చాలా కష్టతరమైన పని అని తెల్సి కూడా సంకల్ప సిద్ది ఉంటె, ఆశయం మంచిదయినప్పుడు, ఏ స్వార్ధ ప్రయోజనాలు ఆశించకుండా ముందుకు వెళ్తే, తప్పక సుసాధ్యమనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా నాకు ఎంతో అండగా నిల్చిన మా కార్య వర్గసభ్యులకు, ఇంతగా బలోపేతం చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలను తెలుపుతూ, రానున్న కాలంలో మరింత సహకారాన్ని , సపోర్ట్ ను ఇచ్చి ఈ మన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఎంప్లాయిస్ గ్రూప్
ను మరింత విస్తృతం చేయడం ద్వారా మన జాతి మరింత బలోపేతం కావడానికి మీ వంతు సహకారం అంద జేయాల్సింది గా కోరుతూ...
కోట నాగ సూర్య ప్రకాష్ రావు
మరియు
ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఎంప్లాయిస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అందరూ..
AP Viswabrhmin Employees Group